స్థానిక ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు జడ్పిటిసి,ఎంపీటీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి

బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సీ హెచ్ పి స్) కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో శనివారం ఎస్సీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.సమావేశానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు ఖమ్మం,వరంగల్, ఆదిలాబాద్,మహబూబ్ నగర్ 4 జిల్లాలు 86 మండలాలు సుమారు 10 లక్షల జనాభా కలిగిన ఎస్సీ కులాలకు జడ్పిటిసి,ఎంపిటిసి వార్డు సభ్యుల రిజర్వేషన్ లేకుండా జనరల్ లో కలపడం తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లు ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు రాజకీయ రిజర్వేషన్ తో పాటు ఉద్యోగం, ఉపాధి,ఎస్సీ రైతుల అసైన్మెంట్ సాగుభూములకు,పోడుభూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇచ్చి రైతు బంధు రైతు రుణం రైతు భీమా కల్పించాలని డిమాండ్ చేశారు.ఇల్లు లేని ఎస్సీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను గిరిజనేతరులుగా అపనింద వేసి అభివృద్ధికి దూరం చేయొద్దని ఖండించారు.తెలంగాణ రాష్ట్రంలో గత కెసిఆర్ ప్రభుత్వం హాయంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు అన్యాయం,అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ సలహాదారు సింగరేణి మైనింగ్ రిటైర్డ్ జిఎం అందేల ఆనందరావు,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజర్ ఎనగంటి కృపాకర్, సలిగంటి కొమరయ్య,కండె రాములు,ఇనుముల వెంకటేశ్వర్లు, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు చదలవాడ సూరి,మాదిగ ఐక్య సంఘాల వేదిక అధ్యక్షులు వేల్పుల భాస్కర్,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, మేదినా లక్ష్మి, ఎనగంటి అర్జునరావు, ధనసుల పుడి భాస్కర్, దుర్గాప్రసాద్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now