కాంగ్రెస్ ప్రభుత్వం బిసి ఫెడరేషన్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి కోఆపరేటివ్ సొసైటీ ల ద్వారా 10 లక్షల సబ్సిడీ ఇవ్వాలి
*బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు*
*జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 25 ప్రశ్న ఆయుధం*
ఇల్లందకుంట మండల కేంద్రంలోని కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ ఫెడరేషన్ కులాల సమితి ముఖ్య నాయకుల సమావేశం ధర్మల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బిసి డిక్లరేషన్ లో అభయహస్తం బీసీ కార్పొరేషన్ అనుబంధం బిసి ఫెడరేషన్లు కార్పొరేషన్లు సంబంధిత కోఆపరేటివ్ సొసైటీలకు 10 లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని బీసీ కులాల 11 ఫెడరేషన్లు కార్పొరేషన్లకు వెంటనే పాలక మండలికి ఎన్నికలు ప్రభుత్వం జరిపించాలి కేంద్ర ప్రభుత్వం యాక్ట్ 1964 చట్టం కో-ఆపరేటివ్ సొసైటీస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని కోఆపరేషన్ సొసైటీలను పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొసైటీ సబ్సిడీ పథకాలు వర్తింపచేయాలని అన్నారు సభ్యత్వ నమోదును రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద చారి. కరీంనగర్ రాష్ట్ర కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్. అంబటి రవీందర్ రాజు. అలిపి రెడ్డి చంద్రమౌళి. చింతల మల్లేశం. రామగిరి లింగయ్య. బోనకుర్తి సాయికృష్ణ. గట్ల రమేష్. మాలమూరి రమేష్. గుగులస్వామి ముద్రకోల రాజు. వల్పి రెడ్డి సరోజన బాణాల శ్రీకాంత్ పాల్గొన్నారు.