కేసీఆర్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్: హరీశ్.
మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 2023-24 ఏడాదికి గాను వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో, పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ కష్టపడి సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు.