Site icon PRASHNA AYUDHAM

కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్

IMG 20240911 WA0038

*సిరిసిల్లలో నిఫ్ట్ ఎక్స్ టెన్షన్ సెంటర్ 10 కోట్లతో ఏర్పాటు చేయించే దమ్ముందా బండి సంజయ్

*వారణాసిలో మోడీ పెట్టుకున్నాడు చేతనైతే ఇక్కడ ఏర్పాటు *చేయించు..*

*సిరిసిల్ల నేత కార్మికులపై నిర్లక్ష్యం ఎందుకు..?*

*వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పై నీ యాక్షన్ ప్లాన్ ఏంటి..?*

*ఉత్తుత్తి వినతి పత్రాలతో మభ్యపెట్టెడు బంద్ చెయ్..*

*సోలార్ ప్లాంట్స్ పెట్టిస్తే కార్మికుల కరెంటు బిల్లుల సమస్య తీరేది కాదా.. బండి సంజయ్*

*మెగా క్లస్టర్ వరంగల్ కు తరలిపోతే కండ్లప్పగించి చూసింది మీరు కాదా..?*

*చేనేత కార్మికుల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది..*

*కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 11*

కేంద్రమంత్రి బండి సంజయ్ సిరిసిల్ల చేనేత కార్మికుల సంక్షేమం గురించి అసలు నీ విజన్ ఏంటి.. నీ ప్రణాళిక ఏంటి.. అసలు నువ్వు తీసుకున్న చర్యలు ఏమిటి.. ఉత్తుత్తి వినతి పత్రాలతో ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడతారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు బుధవారం కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘజియాబాద్ నుంచి తన నియోజకవర్గమైన వారణాసిలో అదనంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఎక్స్ టెన్షన్ సెంటర్ 10 కోట్లతో ఏర్పాటు చేయించుకున్నారని తెలిపారు. బండి సంజయ్ 10 కోట్లతో హైదరాబాద్ నుంచి సిరిసిల్లలో మరో నిప్ట్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు సిరిసిల్ల చేనేత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఏదో ఉత్తుత్తి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మభ్యపెట్టెడు బంద్ చేయాలని ఇటీవల టెక్స్ టైల్ మంత్రి గిరిరాజ్ కిషోర్ కు సిరిసిల్లలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినట్లు మీడియాలో చూశానని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్లకు మంజూరైన మెగా క్లస్టర్ వరంగల్ కు తరలిపోతే కల్లప్పగించి చూసింది మీరు కాదా.. అని బండి సంజయ్ అని ప్రశ్నించారు. తరలిపోయిన మెగా క్లస్టర్ ను వరంగల్ నుంచి సిరిసిల్లకు తెచ్చే ప్లానా.. లేక రెండో మెగా క్లస్టర్ తెప్పించే ప్లానా.. ప్రజలకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు కేంద్రమంత్రి కి వినతి పత్రం ఇచ్చింది మెగా క్లస్టర్ ఏర్పాటు కా, మినీ క్లస్టర్ ఏర్పాటు కా, మైక్రోక్లస్టర్ ఏర్పాటుకా.. అసలు నో క్లస్టర్ ఏర్పాటు కా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం యార్న్ డిపోకు సంబంధించిన స్కీమ్ ను మూడేళ్ల క్రితం ఎత్తివేసిందని, గత ఐదేళ్ల టర్మ్ లో స్కీం ఉన్నప్పుడు యార్న్ డిపో ఏర్పాటు విషయం ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు. సిరిసిల్ల నేత కార్మికుల సంక్షేమం కోసం టెక్స్ టైల్ మేనేజర్ తో ఒక్కసారి సమావేశం నిర్వహించారా.. సమీక్ష చేశారా. అసలు కలిశారా.. అని నిలదీశారు. మీరు కేంద్ర టెక్స్ టైల్ మంత్రికి అందజేసిన వినతి పత్రం ప్రతిపాదన తయారు చేసి ఇచ్చారా.. అసలు సిరిసిల్ల టెక్స్టైల్ మేనేజర్ ను సంప్రదించకుండానే.. ప్రతిపాదనలు తయారు చేయకుండానే ఇచ్చిన వినతి పత్రమా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ సిరిసిల్లలో ఉన్న 35 మంది యువ పారిశ్రామికవేత్తలను తిరుపూర్, కోయంబత్తూరు వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై పరిశీలనకు ఎప్పుడైనా తీసుకెళ్లారా వారితో ఎప్పుడైనా మాట్లాడారా.. సమావేశం నిర్వహించారా. సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారా.. వారికి కావాల్సిన సదుపాయాలు అడిగారా. ఆ దిశగా ప్రణాళిక చేద్దామని ఆలోచించారా.. చెయ్యకపోతే ఇంతకన్నా అన్యాయం దుర్మార్గం ఉంటుందా అని పేర్కొన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విద్యుత్తు బిల్లుల సమస్యకు సంబంధించిన పంచ్ డైలాగులు మానుకోవాలని సూచించారు. విద్యుత్తు బిల్లుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని త్వరలోనే దానికి సంబంధించిన జీఓ విడుదలవుతుందని పేర్కొన్నారు. టెక్స్టైల్ మంత్రితో మాట్లాడి వస్త్ర పరిశ్రమ షెడ్ల మీద 90 శాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్లను సిరిసిల్లలో ఒక్క పవర్ లూమ్ పరిశ్రమంలోనైనా మీరు పెట్టించారా.. ఆ దిశగా ఆలోచన చేశారా. చేస్తే వారికి విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉండేది కాదన్నారు. కనీసం 30 షెడ్లకు సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తయారు చేశారా.. ఆలోచన చేశారా.. చెయ్యకపోతే ఇంత అన్యాయం దుర్మార్గం ఉంటుందా. అని బండి సంజయ్ ని ప్రశ్నించారు.
చేతకానితనం వల్ల హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ గత ఐదు సంవత్సరాలలో కానిది.. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఇటీవలే ప్రారంభించారని తెలిపారు. దీనివల్ల ప్రతి సంవత్సరం 60 మంది యువకులకు టెక్స్ టైల్ టెక్నాలజీ హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సులో ట్రైనింగ్ అండ్ ఓరింటేషన్ ఇవ్వనున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల క్రితం యార్న్ డిపోకు సంబంధించిన పథకం రద్దు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులు యార్న్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఈ మేరకు టెక్స్టైల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా 30 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు యార్న్ గుజరాత్ ఇతర ప్రాంతాల నుంచి తెప్పిచ్చి సిరిసిల్లలో వేర్ హౌసింగ్ డిపోలో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు యార్న్ కోసం నేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మూడు సంవత్సరాల క్రితం స్కీమ్ అమల్లో ఉన్నప్పుడే యార్న్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే బాగుండేది కదా.. అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు నిద్రపోయారని నిలదీశారు. ఉత్తుత్తి ప్రకటనలు. ఉత్తుత్తి మాటలు బంద్ చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి ఇప్పటికైనా పాటుపడాలని సూచించారు.
తమ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నదని, రైతులకు రుణమాఫీ చేసినట్లే చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు కుమ్మక్కైన గత బిఆర్ఎస్ సర్కారు పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలను 270 కోట్లను చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి స్వశక్తి మహిళలకు ప్రతి ఒక్కరికి రెండు చీరలు అందిస్తామని ప్రకటించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదని, కోటి 30 లక్షల చీరలు ఆర్డర్లు ఇస్తామని నిర్ణయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేర్కొన్నారు.
బండి సంజయ్ చేనేత కార్మికుల సంక్షేమంపై ఎందుకింత నిర్లక్ష్యం ఎందుకు ఇంత మొద్దు నిద్ర అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్మీ క్లోసింగ్ రిక్వైర్మెంట్, సెంట్రల్ పోలీస్ సర్వీస్ రిక్వైర్మెంట్ ద్వారా సిరిసిల్ల చేనేత కార్మికులకు చిన్న ఆర్డర్ అయిన ఇప్పిస్తారా.. నేత కార్మికుల గురించి ఏది చేతకాని మీకు వారు మీతో ఎందుకు కలిసి నడుస్తారని ప్రశ్నించారు.
సిరిసిల్ల చేనేత కార్మిక ప్రతినిధులను ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసికి ఒక బృందాన్ని తీసుకెళ్లి అక్కడ వస్త్ర పరిశ్రమ ను మోడీ ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూపించే ప్రయత్నం చేశారా.. మన పద్మశాలి వ్యాపారులు, కార్మికులు అది చూసి అచ్చేరువు చెందుదురు కదా.. అని పేర్కొన్నారు. బండి సంజయ్ ఈ దృశ్యరూపం ఎందుకు చూపించడం లేదు సిరిసిల్ల పట్ల మీ నిర్లక్ష్యం తెలిసిపోతుందా.. అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు.

Exit mobile version