Site icon PRASHNA AYUDHAM

రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా..? రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకం మోదీ 

నెత్తురంటిన చేతులు ఎవరవి?* 

రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా..? రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకం మోదీ

_*దేశ విభజన నాటి మత కల్లోలా నుంచి , ఆహమ్మదాబాద్, ముంబై, ఈ మోదీ-షా ల కాలం నాటి అమానుషమైన గుజరాత్ జాతి హత్యాకాండ.. మణిపూర్ మంటల వరకూ…. నెత్తురంటిన చేతులు ఎవరివి మోదీ మీవీ కావా..? మీ ఆర్.ఎస్.ఎస్ వి కదని చెప్పే దైర్యం ఉందా..?*_

 

 

*మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారత దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్‌ చూస్తోందని మాట్లాడడం ‘బాబూ దేవతలక్కూడా మోదీ నాట్యం నే ర్పుతారనిపిస్తుంది”……*

ఈ పదేళ్ల బీజేపీ మోదీ-షాల పాలన లో భారత దేశ ప్రజల మధ్య వ్యవస్థాపరంగానే అనైక్యతను కొనసాగిస్తూ దేశాన్ని గుజరాతి వ్యాపారులు అంబానీ-ఆదానిల వంటి పిడికెడు గుత్త పెట్టుబడి దార్లకు దేశంలోని వనరులను… కార్మికుల శ్రమను కారుచౌకగా దోచిపెట్టేందుకు అణిచివేతలను కోనసాగిస్తున్నది మోదీ-షాలన్నది నిజం కదా..? ఇందుకు కుల వ్యవస్థను ఉపయోగించుకున్నది నిజం కాదా..? . _*సృష్టికర్త అయిన దేవుడు తన ముఖము నుండి బ్రాహ్మణులను భుజముల నుండి క్షత్రియులను తొడల నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను పుట్టించాడు అంటూ పురాణ కథలను వినిపిస్తూ నేటి ఆధునిక యుగములో ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకొని కుల భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది దేశభక్తి గురించి తెగ రెచ్చిపోతూ మాట్లాడే ఆర్.ఎస్.ఎస్ కు పూసిన పువ్వే కదా మోదీ….*_ _భారత ప్రజల ప్రీయతమ నాయకుడిగా..భావి భారత సమాజ ఆశజ్యోతిగా అవిర్భవిస్తున్న రాహుల్ గాంధీ భారత ప్రజానీకం ముందు పెడుతున్న ప్రశ్నలు దేశభక్తి గుత్త సొతంతైనట్టు మాట్లాడే మనువాదులకి ప్రతినిధిని భారతీయ జనతాపార్టీ దాని తల్లి ఆర్.ఎస్.ఎస్ గుండెళ్లో గుచ్చుకుంటున్నాయి కనుకనే మోదీ పెడబొబ్బలు పెడుతున్నరు._

 

 

లౌకికవాదం.. రాజ్యంగం ను కాపాడాలని ప్రేమ ను పంచుతూ కాన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు…. దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసిగొల్పుతూ ప్రమాదకర క్రీడ ఆడుతున్నారని ప్రధాని హోదాలో మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు కదా…?

అసలు రాహుల్ గాంధీ ఎమంటున్నారు?? దేశాభివృద్ధి కోసం కులగణన చేయమనడం దేశాన్ని విభజించినట్టా..? రాహుల్ గాంధీ ఈ సమాజం ఎట్లుందో చూసుకోవాలని అడగడం తప్పా…? వాస్తవం ను ధైర్యంగా చెప్పడం దేశ ద్రోహమా…?

భారత సమాజం ఎంటిదో తెలుసుకోకుండా.. భారత సమాజ ప్రగతి.. డెవలప్మెంట్ గురించి మాట్లాడమనేది దర్మార్గం కదా?? .

భారత సమాజంలో ఉన్న సమాజాన్ని అర్ధం చేసుకోకుండా ఫలితమెట్ల చెబుతవని ప్రశ్నీంచడం ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యతను చెడగొట్టడమౌతోందా..?

ఈ దేశంలో దళిత్స్, ఆదివాసీస్, మైనార్టీస్, మహిళా… ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం తప్పా… ?

వీళ్ల డెవలప్మెంట్ జరిగితే సమాజం డెవలప్ అయినట్టని .. జ్యూడిషియరి, మీడియా, . న్యాయవ్యవస్థ మొత్తం ఈ దేశం నడుస్తున్న ఫోర్త్ ఎస్టేట్ గురించి నాలుగు అంగాలు దేశంలో ఉన్నయి. ఈ నాలుగు అంగాలలో ఎవ్వని స్థానమెంటో తెలుసుకోమనడం… ఈ వర్గాలు ఎక్కడ ఉన్నయి తెలుసుకో. మీడియా లో ఆదివాసి యాంకర్ అనేవాళ్లు వున్నారా తెలుసుకో … బ్యూరోక్రసీలో ఉద్యోగస్తులలో ఎవరెంత మందో తెలుసుకోవడం దేశ విభజన దారీ తీస్తదా..?

 

ఈ దేశం లో కుల వర్గం గురించి మాట్లడకుండా .. కులం.. వివక్షత.. ఆర్ధిక అసమానతల గురించి పై రెండు వాటి గురించి మాట్లడకుండా భారత దేశ సమానత్వం గురించి మాట్లడడం.. డెవలప్ మెంట్ గురించి మాట్లడడం… ఆ వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడం అంత్యంత దుర్మార్గం… డొల్లతనమని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గా ఈ దేశంలో ఉన్న నగ్నసత్యాన్ని మాట్లడితే ‘ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యతను చెడగొట్టడమే…ప్రధాన ఎజెండా. ‘గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టాలన్నది కాంగ్రెస్‌ ఎజెండా. అని మోదీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నడు. ఈ దేశంలో వాస్తవాల మీద కులగనన చేయకుంటే ఈ దేశంల ప్రజలు.. ప్రజాస్వామిక డెవలప్మెంట్ గురించి మాట్లాడేటోళ్లకు ప్రత్యామ్నాయం లేదని హెచ్చరించడం ఏవిధంగా జాతీ విద్రోహచర్యనో ఆర్.ఎస్.ఎస్.. బీజేపీ ప్రధాని మోదీనే చెప్పాలి.. కాంగ్రెస్ పార్టీ గా.. లోక్ సభ లో ఇండియా కుటమీ తరఫున ప్రతికపక్ష నేతగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల అబ్యున్నతి గురించి ప్రొగ్రాం తీసుకుంటే అది ఒక ప్రజాస్వామిక పద్దతితో కొనసాగించాలని మాట్లాడుతుంటే దేశాన్ని విభజించడం ఎలా అవుతుంది..? ఈ వ్వవస్థ గురించి మాట్లాడుతూ భారత సమాజం ఎదుర్కొంటున్న రుగ్మాతలకు పరిష్కారం కోసం ఎక్స్రే వంటి కులగణన చేయమని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ప్రభుత్వంతో కుల గణన ప్రారంభించడం ఏ విధంగా తప్పో ప్రజల ముందు చెప్పాలి. అందులో మేధావులు.. పౌర సమాజం.. కుల సంగాల ప్రతినిధులు.. సమాజీక కార్యకర్తలలో సంభాషణ జరిపడంతో ఈదేశంలోని దేశంలో బీజేపీ కి పొలిటికల్ ప్రత్యామ్నాయం ప్రోగ్రమని…. ఇది ఇలా డెమోక్రటిక్ ప్రాసేస్ కోనసాగిస్తే ఈదేశంలో మనువాదుల ప్రతినిధి పార్టీ భారతీయ జనతాపార్టీ దాని నాయకుడి మోధీ-షాల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నయి.. ఆర్.ఎస్.ఎస్ పునాదులు కదులుతున్నయి.

 

_*జాతీయ కాంగ్రెస్ పార్టీ లౌకివవాద పార్టీ ..ఈ దేశానికి స్వాతంత్య్రం తేవడమే కాదు*_ ..

_*వచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పేదలకు,దక్కేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు. గారిబ్ హఠావో..రాజభరణాల రద్దు..భూమల పంపకాలు..*_

_*అంబెడ్కర్ వంటి మహానుభావునీతో రాజ్యాంగం రచన చేయడానికి కాంగ్రెస్ అవకాశం కల్పించింది.*_

*రిజర్వేషన్లు వంటి వాటితో పేదల బతుకులలో* *మార్పు.పేద,ధనిక ,కులం,మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజలను దేవుళ్ళను చేసిన ఘనత కాంగ్రెస్ ది. రిజర్వేషన్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ని పట్టుకొని రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మోధీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నడు.*

*ఇవాళ ప్రతి పార్టీ ,ప్రతి రాజకీయ నాయకులు 5 ఏళ్ల ఒకసారి పేదల ఇండ్లకు వచ్చి బ్రతిమాలి ఓటు అడుగుతున్నారంటే అది అంబెడ్కర్ ద్వారా అవాకాశం కల్పించింది కాంగ్రెస్ ది.*

 

Exit mobile version