సంగారెడ్డి/సదాశివపేట ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాస చివరి ముహూర్తం సందర్భంగా నిర్వహించిన పలు శుభ కార్యక్రమాలలో భాగంగా సదాశివపేట పట్టణంలోని చాపలకేరికి చెందిన నల్ల సాయిశ్వేత – రామకృష్ణ మరియు నల్ల అనిత – ప్రవీణ్ కుమార్ అన్నదమ్ముల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి బంధువులు పద్మ, గురుచరణ్, తరుణ్, నల్ల సుధాకర్, సాయి కిరణ్, ఆనంద్, పీఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రమేష్, అఖిల్, నాగరాజు, మునిపల్లి రమేష్ , సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
*నూతన గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు*
Published On: August 28, 2024 3:38 pm
