🟠 బాన్సువాడలో కాంగ్రెస్ నేత రాజేష్ బీజేపీలో చేరిక
బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15
బిర్కూరు మండలం రైతు నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ బీజేపీలో చేరిక
జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ సమక్షంలో చేరిక కార్యక్రమం
మాజీ వార్డు మెంబర్ నర్సా గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మొగులయ్య, బుక్కారెడ్డి, మాల్గొండ మహేంద్ర, ప్రసాద్, శివరాజ్తో పాటు 30 మంది యువకులు బీజేపీలో చేరిక
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగేల్ల సాయికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, చిదుర సాయిలు తదితరులు పాల్గొన్నారు
“మోదీ పాలనలో దేశ అభివృద్ధి దిశగా సాగుతోంది… అందుకే బీజేపీలో చేరాం” — కొత్తగా చేరిన నేతల ప్రకటన
బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు రాజేష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధి, ప్రజాసేవా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు నేతృత్వం వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు చిదుర సాయిలు, టౌన్ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, “దేశంలో మోదీ నేతృత్వం పట్ల విశ్వాసం పెరిగింది. అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బీజేపీతో ముందుకు సాగాలనుకుంటున్నాం” అని తెలిపారు.