మెట్పల్లి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అడ్డూరి రాములును కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యం రావు, మాజీ కౌన్సిలర్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
Published On: November 16, 2024 5:49 pm
