*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి-కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్*
*ఇల్లందకుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాట పైన ఉండి అధిక నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని అండగా ఉంటాడని నమ్మి 80333 వేల ఓట్లు వేసి 16873 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని సభ మర్యాదలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ఒక రౌడీగా వ్యవహరిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తలదించుకునే విధంగా వ్యవహరిస్తూ తోటి ఎమ్మెల్యేలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురి చేస్తున్నాడని ఏదైనా పనిమీద ఇతర ఎమ్మెల్యేల వద్దకు మంత్రుల వద్దకు వెళితే ఏమని చెప్పుకోవాలని ప్రజలు అంటున్నారని కాంగ్రెస్ నాయకుడు గడ్డి శ్రీనివాస్ అన్నారు ఇప్పటికైనా మా ఎమ్మెల్యే మారి సభ మర్యాదలకు భంగం కలిగించకుండా ప్రవర్తించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని కోరుతున్నామని లేనిపక్షంలో వెంటనే ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు