Site icon PRASHNA AYUDHAM

పిల్లుట్ట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

IMG 20251028 105256

Oplus_16908288

నర్సాపూర్, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివ్వంపేట మండలం పిల్లుట్ట గ్రామంలో గొల్ల అంజయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) 15వేల రూపాయల చెక్కును అందజేసిన పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, యువ నాయకులు బుర్ర మురళిగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గ్రామానికి దాదాపుగా 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 30 లక్షల వరకు పనులు పూర్తి చేశామని, సీసీ రోడ్లు, మొదటి విడతగా 10 లక్షల రూపాయలతో స్కూల్ ప్రహరీ గోడ, ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, హాస్పటలలో చికిత్స పొందుతూ ఇబ్బందులు ఉన్న వారికి సొంత డబ్బులతో సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని, అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రామాగౌడ్, గుర్రాల బాలేష్, పిల్లి మధు, పెద్దపులి సతీష్, సాలె దశరథ, గొల్ల స్వామి, కనుకుంటా కృష్ణ, కొత్తపల్లి నాగేష్, నర్సింలు గౌడ్, బుర్ర లింగం, తలారి హనుమంతు రవీందర్, పిల్లి సుధాకర్, అందె నర్సింలు, రంగప్ప బాలేష్, పెద్దపులి రమేష్, బోను కృష్ణ, బండారి శ్రీకాంత్ సండ్ర విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version