కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

*కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*

నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలి రామారావు చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం నూతనంగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఎం కోదండ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని దానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కావడమే ప్రత్యక్ష నిదర్శనమని వారు తెలిపారు.

Join WhatsApp

Join Now