జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన

*జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షలను ప్రతీకార చర్యలను విడనాడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బత్తిన మోహన్ రావు, జిల్లా ఓబీసీ చైర్మన్ వంగల దాలి నాయుడు, సాలూరు ఇన్చార్జ్ గేదెల రామకృష్ణ, ఓ బి సి నియోజకవర్గం ఇంచార్జ్ సిరిసిపిల్లి సాయి శ్రీనివాస్, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు, మామిడి చంద్ర కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్ షీట్ ను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షంపై ప్రతి కార చర్యను మానుకోవాలన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. దేశం కోసం ఆస్తులను ప్రాణాలను ధారపోసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయటం సరికాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడి చార్జ్ షీట్ ను తక్షణమే తొలగించాలన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతాయన్నారు. కేసులతో, చార్జ్ షీట్ లతో గాంధీ కుటుంబాన్ని బెదిరించలేరన్నారు. కూటమిపాలకులు పాలనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, రాహుల్ గాంధీ దేశ అధినేత కానున్నారన్నారు. అది తెలిసే ప్రతిపక్షం పై బురదజల్లే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అధికారం గాంధీ కుటుంబానికి కొత్త కాదన్నారు. దీనిలో భాగంగానే ఆస్తులు బదలాయింపు జరగకుండానే మనీలాండరింగ్ కేసు నమోదు చేయటం హాస్యాస్పదమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. డిఆర్ఓ కే. హేమలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈడి చర్యలను పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా యువత కోరుకుంటున్నారన్నారు. అన్యాయంగా అక్రమంగా ఈడి కేసులు వేసిందని ఆరోపించారు. బిజెపి కుటిల ప్రయత్నాన్ని విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment