హైద్రాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, బూత్ స్థాయి వరకు పార్టీ బలమైన కార్యకలాపాలు ఎలా జరపాలనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల సమస్యలు, అభివృద్ధి చర్యలు, పార్టీ కార్యకర్తల గుంపుల సంఘటితం, కొత్త నియామకాల ప్రాముఖ్యతపై మంత్రివర్యులు సుదీర్ఘంగా మాట్లాడారు.ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొని నాయకుల అభిప్రాయాలు, సూచనలు, అవసరాలను జాగ్రత్తగా పరిశీలించిన ఝాన్సీరెడ్డి తదుపరి కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమీక్షా సమావేశం..
