నాగారం కాలనీల్లో కాంగ్రెస్ నాయకుల పర్యటన

*నాగారం కాలనీల్లో కాంగ్రెస్ నాయకుల పర్యటన*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జులై 27

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని టీపీఎస్ కృష్ణానగర్ మరియు హెవెన్ డౌన్ కాలనీలను ఆదివారం నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ సందర్శించారు. కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు వచ్చిన వీరు, కాలనీలలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో గోధుమకుంట మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి పర్వత రెడ్డి, గోధుమగుంట మాజీ వార్డు సభ్యులు చీర శేఖర్, టీపీఎస్ కృష్ణానగర్ కాలనీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, హెవెన్ డౌన్ కాలనీ అధ్యక్షులు బండారి రమేష్, ఈరయ్య తదితరులు పాల్గొన్నారు. రెండు కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

Join WhatsApp

Join Now