నాగారంలో వినాయక మండపాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఓల్డ్ విలేజ్ ఎస్సీ కాలనీ మరియు ఎస్వీ నగర్‌లలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక మండపాలను బుధవారం నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. గణనాథుని దర్శించుకున్న అనంతరం, భక్తుల మధ్య నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో నాగారం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండపాల్లో భక్తులు, యువత ఉత్సాహంగా పాల్గొనగా, డప్పులు, హారతులు, ప్రసాద వితరణతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్యటనలో భక్తులు, యువకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.