జిల్లా రెవెన్యూ అధికారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు

*జిల్లా రెవెన్యూ అధికారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 6 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం మున్సిపల్

న్సిపాలిటీ పాలనపై దృష్టి సారించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలతతో కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతిపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం మున్సిపాలిటీ పరిపాలనపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేదన్నారు. అలాగే బడ్జెట్ సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. దీంతో పార్వతీపురం మున్సిపాలిటీలో ఆర్థికపరమైన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయన్నారు. వారిద్దరి మధ్య సమన్వయ కూడా మున్సిపల్ పాలనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అలాగే మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా వారానికి ఒకరోజు కుళాయిలు రావడం జరుగుతుందన్నారు. దీనివలన ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్వతిపురం మున్సిపాలిటీలో వేసవి తీవ్రంగా ఉందన్నారు. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీలో చెత్త నుండి సంపద తయారీ జరగటం లేదు అన్నారు. చెత్త సాగ్రిగేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర కార్యక్రమాలు జరగటం లేదన్నారు. కాబట్టి అవన్నీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో పాలన సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. దానికి స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలత తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను ఆదేశించారు.

Join WhatsApp

Join Now