Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషుల నుండి నన్ను కాపాడండి రేవంత్ రెడ్డి సారు

Screenshot 2025 05 03 14 59 10 602 edit com.whatsapp

పారిశుద్ధ కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు

ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషుల నుండి నన్ను కాపాడండి రేవంత్ రెడ్డి సారు

దానం నాగేందర్ అనుచరులు నన్ను చంపాలి చూస్తున్నారు అంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ పారిశుద్ధ కార్మికురాలి విజ్ఞప్తి

అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు యత్నించడమే కాక తనపై దాడులకు తెగబడుతూ కేసుల పాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన పారిశుద్ధ కార్మికురాలు నారాయణమ్మ

దయనీయ పరిస్థితిలో ఉన్న తనకు అప్పటి ప్రభుత్వం ఫిలింనగర్ వినాయక నగర్లో 120 గజాల స్థలాన్ని కేటాయించిందని.. సదరు స్థలంలో ఎంతోకాలంగ జీవిస్తున్న తమను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు స్థలాన్ని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసిన నారాయణమ్మ

తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయలేదని కన్నీరు పెట్టుకున్న పారిశుద్ధ కార్మికురాలు

న్యాయం కోసం తిరుగుతుంటే తనపైనే కేసులు బనాయిస్తున్నారని.. ఫీలింనగర్ బస్తిలలో స్థలాల పంపిణిల పేరుతో జరుగుతున్న అక్రమాల పై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు తనకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని వేడుకున్న నారాయణమ్మ

Exit mobile version