రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచురించిన పత్రికా ప్రకటన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పదంగా మారింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటన సందర్భంగా పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ ఫోటో చేర్చకపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారశైలిపై మీనాక్షీ నటరాజన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఆమె ఫోటో వేయించలేదని వినిపిస్తోంది. పొంగులేటి పేపర్ యాడ్‌లో మీనాక్షీ ఫోటో లేకపోవడం పార్టీలోని ఒక వర్గాన్ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం.