కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది.

*కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది* ..

*కామారెడ్డి బిసి డిక్లరేషన్ ని త్వరగా అమలు చేయాలి* ..

*బిజెపి ఓబీసీ మోర్చా డిమాండ్*..

*జమ్మికుంట జనవరి 6 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మభ్యపెడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తానని కామారెడ్డిలో ప్రకటించినచి ఏడాది గడుస్తున్నప్పటికీ బిసి డిక్లరేషన్ అమలు చేయకపోవడం బీసీలను మోసం చేసినట్లేనని తక్షణమే రిజర్వేషన్లు చేపట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మంగళవారం (07-01-2024) రోజున అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టి తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వాలని బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ బిజెపి ఓబీసీ మోర్చా స్టేట్ కౌన్సిలర్ నెంబర్ కొత్త శ్రీనివాస్ అన్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతర వేన రమేష్ యాదవ్ , బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్ నాయకులు పుల్లూరు ఈశ్వర్, కొండపర్తి ప్రవీణ్, దొంగల రవి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now