Site icon PRASHNA AYUDHAM

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్

IMG 20250623 WA2145

*సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్*

*హుజురాబాద్ జూన్ 23 ప్రశ్న ఆయుధం*

వివిధ కారణాలతో హాస్పిటల్లో చేరి ఖర్చుల పాలైన పేద వారికి ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన సహాయం చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని నియోజకవర్గ కేంద్రంలో 5 మండలాల సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు సోమవారం రోజున చెక్కులను అందజేశారు ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని రైతు భరోసా వరికి బోనస్ మహిళలకు ఉచిత బస్సు గృహ జ్యోతి వంటి అనేక సంక్షేమ పథకాలు నిర్వహించడం జరుగుతుందని ప్రణవ్ తెలిపారు

నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాలకు సంబంధించిన 198 మంది లబ్ధిదారులకు 75,67,000/- లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

హుజూరాబాద్ మండలం-31,హుజురాబాద్ పట్టణం-18,

జమ్మికుంట మండలం-22,జమ్మికుంట పట్టణం-13,

వీణవంక-39 ఇల్లందకుంట-21 కమలాపూర్-54. చెక్కులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version