కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితం

కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితం

కామారెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తోట బాలరాజ్

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితం అని కామారెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తోట బాలరాజ్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మిపతిలు అన్నారు.
ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆదేశాల మేరకు ఓబీసీ కార్యవర్గ సభ్యుడు పెరక వెంకటేష్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మిపతిల ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ప్రస్తుత రేవంత్ సర్కారు అచ్చం అలాగే ఆలోచిస్తోందన్నారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని, బీసీలకు సముచిత స్థానం కల్పించడంలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసిందని దానిలో భాగంగా బీసీల సంక్షేమం కోసం బీసీ సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్షకోట్ల నిధులు కేటాయిస్తామన్నారని, గడిచిన రెండు బడ్జెట్లలో బీసీల ఊసేలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతం పెంచి, వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని, బీసీలకు అధికారం కల్పిస్తామని గొప్పగా చెప్పారన్నారు. రిజర్వేషన్ల పెంపు అతీగతి లేకుండా పోయిందని, కాంగ్రెస్ ఏడాది పాలనలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కమీషన్ ఏర్పాటు చేసి కులగణన చేసి ఆ రిపోర్టును, వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేపట్టి ఎలాంటి వివరాలు ప్రజలకు స్పష్టం చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు వెల్లడించలేదని, బీసీ డిక్లరేషన్ లో బీసీ యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామన్నరని, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలకు సమానంగా బీసీలకు గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కానకుంట గోవర్ధన్, ఉపాధ్యక్షడు చిరంజీవి, రాజు, కౌన్సిలర్ లు అవధూత నరేందర్, సురేష్ గోపాల్, రజినీకాంత్, ధోని, శరత్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now