*వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్లకు ఘన సన్మానం*
*జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం*
నూతనంగా నియమితులైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లను కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు జమ్మికుంట పట్టణంలో శాలువాతో ఘనంగా సన్మానం చేసి స్వీట్లు తినిపించారు. అనంతరం మార్కెట్ కమిటీ పాలకవర్గం కూడా రామారావును శాలువతో సన్మానించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను రైతులకు అందేలా కృషి చేయాలని నూతన కమిటీకి ఆయన సూచించారు రైతులకు వ్యాపారులకు హమాలీ కార్మికులకు వారధిలా పనిచేస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం అందుబాటులో ఉండాలని పార్టీ కష్ట కాలంలో వెన్నంటి ఉన్న కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అనడానికి మార్కెట్ కమిటీ నియామకమే నిదర్శనమని అన్నారు. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ నాయకత్వంలో మనమంతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి డైరెక్టర్లు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి ,సునీల్ ,సూర్య, శ్రీపతి రెడ్డి, రాజేశ్వర్ రావు, శ్రీనివాస్, ఎగ్గేటి సదానందం, రషీద్, శ్యాం కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం అశోక్ తదితరులు పాల్గొన్నారు.