ఈ నెల 6న ఆదిలాబాద్ లో కాంగ్రేస్ పార్టీ సమావేశం

*ఈ నెల 6న ఆదిలాబాద్ లో కాంగ్రేస్ పార్టీ సమావేశం*

*నిర్మల్ -జనవరి 4:-* రైతుల సంక్షేమమే ద్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. ఈనెల ఆరవ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై విశ్లేషణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హదీ, పట్టణ అధ్యక్షులు నందెడపు చిన్ను, మండల పార్టీ అధ్యక్షులు కుంట వేణుగోపాల్, వోడ్నాల రాజేశ్వర్, భుజంగ శ్రీనివాస్ రెడ్డి నాయకులు సబా కలీం, మజర్, గాజుల రవి కుమార్, ఈటల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now