తోక తొండం లేని మాటలు కాంగ్రెస్ పార్టీ వి

*తోక తొండం లేని మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులవి*
*కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ జానీ*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం::-*

ప్రజలకు ఏమి చేసేది లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తోక తొండం లేని మాటలు మాట్లాడుతున్నారని జమ్మికుంట పట్టణంలోని బిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు యండి జానీ తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సరిగ్గా నిర్వహించాలని అవి ఏవి జరగకుండా కాంగ్రెస్ నాయకులు తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ప్రజలకు మేలువయే విధంగా ప్రజాపాలన జరగాలని డిమాండ్ చేశారు బుధవారం రోజు ఆబాది జమ్మికుంట జరిగిన చాప పిల్లల కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని విలేకరులతో మాట్లాడుతుండగా కొంతమంది కాంగ్రెస్ గుండాలు హేమమైన చర్యలు చేశారని అన్నారు గత ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గం కి లక్షలాది చాప పిల్లలు పంపిణీ చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజరాబాద్ నియోజకవర్గం లో వేళల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నారు ఈ ఈ సందర్భంలో నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కళ్యాణం జరిగిన నెల రెండు నెలలు లోపు ఇచ్చేవారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచిన ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఇవ్వలేదని అన్నారు జమ్మికుంట పట్టణంలో నిన్న కొంతమంది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తోకతుండంలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు

Join WhatsApp

Join Now