Site icon PRASHNA AYUDHAM

నిరుపేదల అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది..

*నిరుపేదల అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది..*

*-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి*

*జనగామ జిల్లా:*

పాలకుర్తి మండలకేంద్రంలోని ఎంమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు బాధపడుతూ మెరుగైనా చికిత్స కోసం ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు చేయూతనిస్తూ పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల,పాలకుర్తి,దేవరుప్పుల మండలాలకు చెందిన వివిధ గ్రామాలోని 149 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన సుమారు 44,88,500 రూ. విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపించేసిన స్థానిక పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశశ్విని రెడ్డీ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని,పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని,పెద్ద మొత్తంలో సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందని,నిరుపేదల అభివృద్ధియే లక్ష్యంగా అనేక సంక్షేమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని,రాబోయే రోజుల్లో అనేక సంక్షేమాలు పథకాలు చేపట్టబోతున్నమని,సంక్షేమ పథకాలు,అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని,అప్లికేషన్ గడువును ఆరు నెలల నుండి సంవత్సరానికి పెంచినా ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని,నియోజకవర్గంలో ప్రజలు ప్రమాదాల బారిన ఎవరైనా,తమ దృష్టికి తీసుకురావాలని,ప్రజలందరికీ సీఎంఆర్ఆఫ్ అప్లికేషన్లపై అవగాహన కల్పించాలనికార్యకర్తలకు నాయకులకు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్య నారాయణ, ఏఎంసీ చైర్మన్ మంజుల భాస్కర్, పాలకుర్తి,దేవరుప్పుల, కొడకండ్ల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, నల్ల శ్రీరామ్, దారావత్ సురేష్, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామపార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version