ఘనంగా మొహర్రం వేడుకలు.. భక్తులకు శరావత్ పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ దంపతులు…* 

*ఘనంగా మొహర్రం వేడుకలు.. భక్తులకు శరావత్ పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ దంపతులు…*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 6

 

 

మొహర్రం సందర్భంగా గ్రామాల్లో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామంలో ఊరేగించి ఉత్సవాలను జరుపుకోగా కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.

ఫరీద్ పేట్ లో పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రతి సంవత్సరం ననిర్వహించగా ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు.ఫరీద్ పేట్ గ్రామంలో కుల, మాతాలకతీతంగా శనివారం రాత్రంతా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మసీద్‌లలో ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు ఆయా గ్రామాల్లో భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు. పలు గ్రామాల్లో రాత్రివేళ మహిళల ఆటపాటలతో బొడ్డెమ్మలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. హిందువులు, ముస్లీంలు కలిసికట్టుగా పీర్ల ఎదుట డప్పుల చప్పుడులతో ఆడిపాడిన అలయ్‌ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.మొహర్రం ఉత్సవాల్లో భాగముగా పల్లె రమేష్ గౌడ్ దంపతుల చేతుల మీదుగా శరావత్ పంపిణీ చేశారు. పండగ ఉత్సవాలను ఆదివారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లో పీఈ ఊరేగింపులో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల గుండా ఊరేగించి నిమజ్జనంకు సమీప చెరువులకు తరలించారు. పీర్ల ఊరేగింపు ముందు యువకులు, మహిళలు ఆటా, పాటలతో అలరించారు. పీర్ల పండుగను ఘనంగా జరుపుకున్నా రు. కులమతాలకు అతీతంగా వేడుకలు జరుపుకున్నారు. ఉదయం పీర్ల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామాలలో పీర్లను ఊరేగించారు. యువకులు అలావ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసి పాటలు పాడారు. పీర్లు ఎత్తుకున్నవారు పీర్ల ఊరేగింపులో పూనకాలతో ఊగిపోయారు. భక్తులు పీర్లకు దట్టీలు, ప్యాతాలు సమర్పించారు. సాయంత్రం పీర్లను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి బట్ట వెంకట రాములు, బట్టెంకి బాలరాజ్ కుల పెద్ద మనుషులు అన్నం బాలరాజా గౌడ్, గోపాల్ రెడ్డి రాజిరెడ్డి, మేకల భూమయ్య, తమ్ముడి స్వామి,సగిడి శివయ్య, కొంపల్లి పెంటయ్య, మల్లెపూల శ్రీకాంత్ గౌడ్, కారంగుల సుధాకర్ రెడ్డి, బట్ట బాల్నర్స్ పల్లె స్వామి గౌడ్ దేవుళ్ళ లక్ష్మీనర్సు, నాయకులు, భక్తులు మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment