హైదరాబాద్‌లో కన్నుమూసిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ

హైదరాబాద్‌లో కన్నుమూసిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ..

IMG 20240826 WA0061

కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు వసంత్ రావ్ బల్వంత్ రావ్ చవాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.మహారాష్ట్రలోని నాందెడ్ లోక్‌సభ నియోజకవర్గానికి వసంత్ చవాన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతాప్ రావ్ గోవింద్ రావ్ చిఖలికర్‌ను 50 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. ఆయన స్వస్థలం నయీగావ్. లోక్‌సభకు ఎన్నిక కాకముందు నయీగావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.కొంతకాలంగా వసంత్ చవాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాందెడ్‌లో చికిత్స తీసుకున్నారు. మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి హైదరాబాద్‌కు వచ్చారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. మరింత విషమించింది. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణం పట్ల మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించింది. ఈ మేరకు మహారాష్ట్ర పీసీసీ అధినేత నానా పటోలే ఓ ప్రకటన విడుదల చేశారు.

Join WhatsApp

Join Now