Headlines:
-
“పేదలకు కాంగ్రెస్ అండ, హుజురాబాద్ లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ”
-
“వివిధ అనారోగ్య బాధితులకు అండగా కాంగ్రెస్ – ప్రణవ్ చెక్కులు అందజేత”
-
“హుజురాబాద్ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ కీలకమైన అండగా – ప్రణవ్ అభిప్రాయం”
*పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్*
*హుజురాబాద్ అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం*
అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అనంతరం మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని పేర్కొన్నారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కి హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.