మన్మోహన్ సింగ్ మరణాన్ని రాజకీయం చేస్తున్న – కాంగ్రెస్…
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు..
ప్రధానిగా పదేళ్లు సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ను ఒక రబ్బరు స్టాంపుగా వాడుకొని అడుగడుగున అవమానించింది సోనియా, రాహుల్,
మన్మోహన్ తెచ్చిన ఆర్డినేన్స్ ను చింపేసిన ఘనత రాహుల్ కె దక్కుతుంది అన్నారు.
మన్మోహన్ సింగ్ సేవలు గుర్తించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను జరిపించి, ఢిల్లీలోనే స్మారక స్టాల్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయిందన్నారు.
తెలంగాణ బిడ్డగా ఈ దేశానికి ప్రధానిగా సేవాలాందించిన పీవి నర్సింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండ అతని భౌతిక ఖాయాన్ని పార్టీ కార్యాలయంలో పెట్టనివ్వకుండ అవమానించిన పార్టీ కాంగ్రెస్.అది ఆనాడు తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గౌరవం అని అన్నారు.
బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ బిడ్డ పీవికి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బిజెపి అన్నారు.
ఈనాడు మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రతేక అసెంబ్లీ పెట్టి సంతాప తీర్మానం పెట్టడం పై తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.