సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు పోలీస్ కృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో పోలీస్ కృష్ణ రెండు రాష్ట్రాల్లోని పలు రాజకీయ విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు చరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు కృష్ణ
Published On: September 28, 2024 6:12 pm
