ఈనెల 31 న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి

ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలి,పని గంటల పెంపు ఆలోచన విరమించుకోవాలి.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని, పని గంటల పెంపును విరమించుకోవాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని,సకాలంలో వేతనాలు చెల్లించాలని,కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధన కోసం టి యు సి ఐ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా ఈ నెల 31న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. సోమవారం వంద పడకల హాస్పిటల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల వేతనాలు పెంచలేదని,వారి సమస్యలను పరిష్కరించలేదని మేము అధికారంలోకి వస్తే కార్మికుల వేతనాలపెంచుతామని, వారి సమస్యలను
పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి18 నెలలు గడుస్తున్నా అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని, వారి వేతనాలు పెంచలేదని, కార్మిక శాఖ మంత్రిని నియమించడంలో కూడా నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా అన్ని రంగాల కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టి వేతనాలు పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పని గంటల పెంపు ఆలోచనను విరమించుకోవాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment