పంచాయతీ కార్మికుల ఐదో మహాసభను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం
*ఈనెల 17న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగే పంచాయతీ కార్మికుల జిల్లా ఐదో మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పులశంకర్ కోరారు సోమవారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులతో కలిసి జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానం రద్దు కోసం, కనీస వేతనం 26,000 చెల్లించాలని, పిఎఫ్ ఈ ఎస్ఐ సదుపాయం అందించాలని, ఉద్యోగ భద్రత పర్మెంటు, ఇతర సమస్యల కోసం భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు ఈ మహాసభ తోడ్పడుతుందని, తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోడేటి దేవేందర్, మొగిలి, మరపల్లి శ్రీకాంత్, కొత్తూరు రాకేష్ పాల్గొన్నారు.