ఎస్ఎఫ్ఐ 6 వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ 6 వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను

సిద్దిపేట ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం:

సిద్దిపేట పట్టణవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాలేజీ కమిటీలు వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఐటిఐ కాలేజీలో కమిటీ నిర్మించిన అనంతరం సిద్దిపేట పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల ఫిబ్రవరి 21,22 తేదీ లలో సిద్దిపేట జిల్లా ఆరవ మహాసభలు సిద్దిపేట పట్టణంలో జరగనున్నాయని వారు తెలియజేశారు మొదటి రోజు 21 తారీఖున భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ సభకి విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు అదేవిధంగా రెండో రోజు 22 తేదీన విద్యారంగా సమస్యల పై చర్చలు, అలాగే నూతన కార్యకలాపాల పైన చర్చలు జరుగుతాయి. అని వారు తెలియజేశారు అనంతరం ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడి లానే ఉన్నాయని వారు అన్నారు నూతన ప్రభుత్వం వచ్చి సంవత్సరమౌతుంది ఎక్సైజ్ శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి దిక్కులేరని వారు అన్నారు తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి విద్యారంగ సమస్యల పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షాన ఎస్ఎఫ్ఐ గా పోరాటం తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కాలేజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ముత్యం, అఖిల్ కమిటీ సభ్యులు శశిధర్, జస్వంత్, విష్ణు కుమార్, సాయి తేజ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment