కత్తితో దాడి కానిస్టేబుల్ మృతి
నిజామాబాద్, అక్టోబర్ 17 (ప్రశ్న ఆయుధం):
జిల్లా కేంద్రంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వినాయక్‌నగర్‌లో వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నట్టు సమాచారం మేరకు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. దొంగను పట్టుకునే ప్రయత్నంలో అతడు ప్రవర్తించిన దుర్మార్గంగా… ప్రమోద్‌ను ఎదుర్కొని అతని పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా… చికిత్స పొందుతూ మరణించాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.