విధులకు గైర్హాజరు, పై అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్.* 

*• విధులకు గైర్హాజరు, పై అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్.*

 

*• పోలీస్ విధులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవు.*

*సస్పెండ్ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS .*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

 

పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌ నందు విధులు నిర్వహిస్తున్న సమయములో కె. రవికుమార్, కానిస్టేబుల్ బస్ వారంట్లను ASI సంతకాలను ఫోర్జరీ చేసి వాడుకోవడం మరియు వాటిని దుర్వినియోగం చేయడం, విధులకు గైర్హాజరు అయ్యి పై అధికారులకు SI, సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు నివేదికలు పంపిచడం, వంటి ఆరోపణలపై బాన్సువాడ డిఎస్పీ నివేదికను పరిశీలించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS తీవ్రంగా పరిగణించి ప్రస్తుతం దేవునిపల్లి పోలీసు స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న కె. రవికుమార్, కానిస్టేబుల్ ను సస్పెoడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఎవరైనా బాధ్యతారాహిత్య ప్రవర్తన లేదా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై శాఖ పరమైన చర్యలు తప్పను అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment