రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా
కామారెడ్డిలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 26
బుధవారం,భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం అత్యంత కీలకమని చెప్పారు
తదుపరి అధికారులతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశ నిర్మాణం కోసం న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, పలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.