ఘనంగా వట్టిపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
జగదేవపూర్ నవంబర్ 26 ప్రశ్న ఆయుధం :
జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జెడ్ పి హెచ్ ఎస్ వట్టిపల్లి పాఠశాలలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును , రాజ్యాంగ విశిష్టతను హెచ్ ఎం డి సరోజ ,సీనియర్ ఉపాధ్యాయులు బాలరాజు ,విజయ భాస్కర్ రెడ్డి ,పరశు రాములు, బాల నర్సింహా రెడ్డి, డాక్టర్ మల్లయ్య ,రవి రాజు ,స్వామి, శారద, సుకృత్ వివరించి చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.