Headlines
-
తాల్కతొరా స్టేడియంలో పొన్నం ప్రభాకర్ ప్రసంగం – కుల గణనపై విశ్లేషణ
-
తెలంగాణలో కొనసాగుతున్న కుల గణన దేశానికి దిక్సూచి: మంత్రి పొన్నం
-
రాహుల్ గాంధీ హామీని తెలంగాణలో నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
-
కుల గణన: సామాజిక న్యాయానికి పునాది
-
రాజ్యాంగ దినోత్సవంలో కుల గణన ప్రాధాన్యతను ప్రస్తావించిన మంత్రి
న్యూఢిల్లీ
ఢిల్లీలోని తాల్కతొరా స్టేడియంలో రాజ్యాంగ దినోత్సవ సభలో
*మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ*
సామాజిక న్యాయం ఆకాంక్షిస్తున్న
కాంగ్రెస్ నేతలకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది
కానీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు..
అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభించాం
క్యాబినెట్ తీర్మానం చేశాం అసెంబ్లీలో అన్ని పార్టీలతో చర్చించి కుల గణన పై తీర్మానం చేశాం
ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కుల గణన కొనసాగుతుంది
95 శాతం కుల గణన పూర్తైంది
తెలంగాణలో కొనసాగుతున్న కుల గణన దేశానికి దిక్సూచిగా నిలుస్తుంది
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేస్తామని ఆశ ప్రజలకు కలుగుతుంది
ఇదే విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం..
రాహుల్ గాందీ చెప్పినట్టుగా మన ఆరోగ్యం సరిగా లేకపోతే మన బాడీ ఎక్స్ రే తీసుకుంటే సమస్య ఏ విధంగా గుర్తిస్తామో అదే రకంగా సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ఈ కులగణన ఎంతగానో ఉపయోగపడుతుంది
ఈ ఎక్స్ రే జరగాలి కుల గణనా అనేది ఎక్స్రే లాంటిదని రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నార్
మేమెంతో మాకంత అనే మాట నిరూపించడానికి ఈ కులగణన ఉపయోగపడుతుంది
రాహుల్ గాంధీ హామీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ కి ఆహ్వానించి సామాజిక వేత్తలు మేదావులు అందరితో చర్చించి ఒక ప్రశ్నావళి రూపొందించి సమాచారాన్ని నమోదు చేస్తున్నాం
సమాచారం మొత్తం సేకరించిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో సమాచారం ఉంచి ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు పరుస్తాం
జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తాం
ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కుల గణన ఐడియా ను తెలంగాణ అమలు చేస్తుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము..
నన్ను ఆహ్వానించిన పెద్దలందరికి ధన్యవాదాలు..