ఎస్సీ కులాలకు రాజ్యాంగ హక్కులు అమలు చేయాలి

అశ్వాపురం తాహసిల్దార్ కు వినతి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సీ హెచ్ పి ఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల తాసిల్దార్ స్వర్ణ కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ కులాల రాజ్యాంగపరమైన స్థానిక రిజర్వేషన్ జడ్పిటిసి, ఎంపీటీసీ,ఉద్యోగ,ఉపాధి ఎస్సీ రైతుల సాగుభూములకు,పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని సమస్యలను తెలియజేశారు.అశ్వాపురం మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.అనంతరం ప్రదర్శన జరిగింది.కార్యక్రమానికి బొమ్మెర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధిలో వెనుకబడ్డది ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు భారత రాజ్యాంగం కల్పించిన స్థానిక రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు దృష్టి పెట్టి ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాలకు అన్యాయం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎనగంటి కృపాకరు, ఇనుముల వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా మహిళా కన్వీనర్ నీలం పార్వతి,దర్శనాల నరసింహారావు, కొమ్మెర పవన్ కళ్యాణ్,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి మండల కన్వీనర్ చీకటి నవీన్,కో కన్వీనర్ టగిర్ష గణేష్, కత్తి కృష్ణ, ఇరుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment