సంక్షేమ హాస్టల్స్ ను మరియు గురుకులాలను కొత్త భవనాలు నిర్మించండి
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు వినతి
నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశమును శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే నీ అందజేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ అనంతరం ఖమ్మం జిల్లాలోని శిథిల వ్యవస్థకు చేరిన బీసీ సంక్షేమ హాస్టల్స్ ని తొలగించి వాటి స్థలంలో కొత్త భవనాలను నిర్మించాలని అదేవిధంగా ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి అద్దె భవనల లో గురుకులాల్ని నడిపిస్తూ విద్యార్థులని మానసిక వేదనకు గురిచేస్తున్నారని తక్షణమే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు విశాలమైన స్థలాలను కేటాయించి కొత్త భవనాలను నిర్మించాలని , పెండింగ్ స్కాలర్షిప్స్ ని వెంటనే విడుదల చేయాలని శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రాన్ని అందించిన వారిలో రాజేందర్ , భూపేష్ సాగర్ ఉన్నారు .