Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Galleryit 20251230 1767101749

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్‌ 30

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సూచించారు. మంగళవారం గాంధారి మండలం వండ్రికల్‌ గ్రామంలో ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణాలు వెంటనే ప్రారంభించి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం, ఇటుకలు వంటి నిర్మాణ సామగ్రి ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉందని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలు దశలవారీగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య గడువులోగా అన్ని ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వండ్రికల్‌ గ్రామంలో మొత్తం 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 2 ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయి వరకు, 1 ఇల్లు రూఫ్‌ లెవెల్‌ వరకు, 4 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఈ కార్యక్రమంలో పీడీ విజయపాల్‌రెడ్డి, డీఆర్‌డీఓ సురేందర్‌, ఎంఆర్ఓ రేణుక చౌహాన్‌, ఎంపీడీఓ రాజేశ్వర్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్‌, హౌసింగ్‌ డీఈఈ, ఏఈలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version