ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
— భూమి పూజ, పనుల వేగవంతం పై సూచనలు
సదాశివనగర్, రామారెడ్డి మండలంలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 28
కామారెడ్డి జిల్లా,సదాశివనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని లబ్ధిదారు అరటి మంగలక్ష్మీ లింభాధ్రి ఇంటి నిర్మాణ పురోగతిని అధికారులు పరిశీలించారు. నిర్మాణం దాదాపు ముగింపు దశలో ఉందని, 20 రోజుల్లో పూర్తి చేసి గృహప్రవేశం చేసేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. లబ్ధిదారులందరూ నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ పథక లక్ష్యమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.