అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా షెడ్ల నిర్మాణం

అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా షెడ్ల నిర్మాణం

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

ప్రశ్న ఆయుధం 22 ఆగస్టు (కామారెడ్డి ప్రతినిధి )

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో గల కోయగుట్ట గురుకుల పాఠశాల పక్కన గల వెంచర్ లో పలువురు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా టీన్ షెడ్లను నిర్మిస్తున్నారు.ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా షెడ్లను నిర్మిస్తున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఒకరిని చూసి మరొకరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తుంది. ప్రధాన రహదారికి సమీపంలోని టీన్ షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్న సంబంధిత అధికారులకు మాత్రం ఏమి తెలియడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఈ విషయమై సంబంధిత మున్సిపల్ అధికారులను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అన్నారు.అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు బాధ్యుడిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు స్థానికులు.

Join WhatsApp

Join Now

Leave a Comment