ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి:
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
గడువులోగా అన్ని దశల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 22
బుధవారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి నిర్మాణ దశను జిపి వారీగా తెలుసుకొని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన కుటుంబాలకు గృహాలు సకాలంలో అందించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి, అడ్డంకులను తొలగించి, మౌలిక వసతులు సమకూర్చేలా జిల్లా యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని సూచించారు.