భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వాహనాలు ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వాహనాలు ఇవ్వాలి

రుణ సదుపాయం కల్పించాలి

మామిడ్యాల లో సిఐటియు జెండా ఆవిష్కరణ

సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య

గజ్వేల్ డిసెంబర్ 31 ప్రశ్న ఆయుధం :

నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వాహనాలు ఇవ్వాలని రుణ సదుపాయం కల్పించాలని, సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అన్నారు. మంగళవారం రోజున భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జెండాను మామిడ్యాల గ్రామంలో ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు దేశవ్యాప్తంగా పోరాటం చేసిన ఫలితంగా 1995 లో భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం వచ్చిందని దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ రంగానికి భారం పడకుండా నిర్మాణరంగం సిస్ రూపంలో వసూలు చేసిన డబ్బులను నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఖర్చు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3500 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని అన్నారు. గతంలో ఆర్టీసీ మరియు రంగాలకు వినియోగించడం జరిగిందని, అలాకాకుండా భవన నిర్మాణ కార్మికులకు మరిన్ని సంక్షేమ పథకాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని కార్మిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరి ని ఇన్సూరెన్స్ కట్టించాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకున్న వారికి సంక్షేమ పథకాలు బకాయి పడినవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ అవసరాల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయవద్దని కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు. కార్మికులందరికీ స్థానికంగా ఉపాధి కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్థానిక మేస్త్రీలు మరియు కూలీలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి, చైర్మన్ పోచయ్య, సిఐటియు నాయకులు వెంకట చారి దశరథ్ నగేష్ మల్లేష్ భవన నిర్మాణ కార్మికులు గణేష్ రమేష్, రఘుపతి బిక్షపతి కృష్ణ తిరుపతి నాగులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now