“భవన నిర్మాణ రంగాల కార్మికులు ఏకమై తమ హక్కులను సాధించాలి”
“ఉప్పు సాయికుమార్: కార్మికుల సమస్యలపై 25 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం”
కామారెడ్డి టౌన్ ప్రశ్న ఆయుధం నవంబర్03
భవన నిర్మాణ రంగాల కార్మికులు ఏకమై తమ హక్కులను సాధించుకోవాలని భవన నిర్మాణరంగాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్లో భవన నిర్మాణ రంగాల కార్మికుల సమావేశం జరిగింది. కమల ఐలన్న నాయకత్వంలో గత 25 సంవత్సరాల నుండి కార్మికుల సమస్యలపైన ఉద్యమాలు చేస్తూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.