Site icon PRASHNA AYUDHAM

ఆలయ ఈవో బదిలీ ఇన్చార్జిగా కొనసాగింపు

IMG 20240802 WA0129

*రాములోరి ఆలయ ఈవో బదిలీ*

*ఈవో వచ్చేంతవరకు ఇన్చార్జిగా కొనసాగింపు*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

అపర భద్రాద్రి గా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో కందుల సుధాకర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుధాకర్ ను కరీంనగర్ మార్కెట్ రోడ్డు లోని వెంకటేశ్వర దేవస్థానానికి బదిలీ చేస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు నాలుగున్నర ఏళ్ల పాటు ఇక్కడ విధులు నిర్వహించారు రెగ్యులర్ కార్య నిర్వహణ అధికారి వచ్చేవరకు ఇన్చార్జి ఈవోగా కందుల సుధాకర్ కొనసాగనున్నారని తెలిపారు ఇక్కడ చాలా సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది లో కొందరు ఒకటి రెండు రోజుల్లో బదిలీ కానున్నట్లు తెలియ వచ్చినది

Exit mobile version