కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలి
– కలెక్టర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంల నిరసన
కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఏఎన్ఎంలను రాత పరీక్ష లేకుండానే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సంఘాల పోరాట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు చేపట్టిన 48 గంటల నిరసన లో భాగంగా నిరసన తెలుపడం జరిగిందన్నారు. వైద్యారోగ్య శాఖలో కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు 24 ఏళ్ల నుంచి రెగ్యులర్ కాకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్ ఎంల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా రాత పరీక్ష తేదీ ప్రకటించడం వెనుకాల ఉన్న అంతర్యమేంటని ప్రశ్నించారు. రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాగా, శిబిరంలోనే రాత్రి నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక, సవిత, లక్ష్మి, ఆర్సియా, దీవెన, స్వరూప, మౌనిక, కవిత, సంధ్యారాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.