ఆలయంలో పాటలు పెట్టడంపై వివాదం: 

ఆలయంలో పాటలు పెట్టడంపై వివాదం:

మాల సంఘ సభ్యుల ఆందోళన

భీమ్‌గల్: తమ తాతముత్తాతల కాలం నుండి ఉన్న ఆలయంలో భక్తి పాటలు పెట్టడంపై పోలీసుల నుండి నోటీసులు అందడం పట్ల మాల సంఘ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తమ కాలనీలోని ఆలయంలో ప్రతి రోజు రెండు సార్లు భక్తి పాటలు వేస్తున్నామని, కానీ అదే విషయాన్ని తప్పుగా చూపిస్తూ,వారి కాలనీలో నివసిస్తున్న ఒక పాస్టర్ పోలీసులకు పిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.

“ఆ పాస్టర్ అనుమతి లేకుండా చర్చిని నిర్వహిస్తూ, ప్రతి రోజు ప్రార్థనలను కొనసాగిస్తున్నారు. దానిపై సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ,ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా తాము దాఖలు చేసిన అభ్యర్థనకు, చర్చికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని తెలిపారు.”హిందూ దేశంలో హిందువులపైనే అన్యాయం జరుగుతోంది. ఇది ఎంతో బాధాకరం. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు.

ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించి ఇరు వర్గాల మధ్య శాంతి భద్రతలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment