బొమ్మెర శ్రీనివాస్
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును హైదరాబాదులో కలిసి వినతిపత్రం అందజేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్ తొలగించి అన్యాయం చేసినారు.కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి ఎస్సీ కులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు 2023 ఎన్నికల సమయంలో ఎస్సీ కులాల సమస్య పరిష్కరించాలని మద్దతు ఇచ్చినాము అయినా ప్రభుత్వo స్పందించడం లేదని అసెంబ్లీలో ప్రస్తావించి ఎస్సీ స్థానిక రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చూడాలని కూనంనేని కోరారు.స్పందించిన కూనంనేని ప్రస్తావించడానికి హామీ ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, రాష్ట్ర నాయకులు కండే రాములు, ఇనుముల వెంకటేశ్వర్లు,నీలం సృజన, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.